మీకు మాత్రమే చెప్తా’ ఫస్ట్ లుక్ రిలీజ్

మీకు మాత్రమే చెప్తా’ ఫస్ట్ లుక్ రిలీజ్

దర్శకులు హీరోలు కావడం కామన్ గానే చూస్తున్నాం. కానీ తన దర్శకత్వంతోఫేమ్

అయిన హీరో నిర్మించిన సినిమాలో అదే దర్శకుడు హీరోగా నటించడం మాత్రం చాలా

రేర్. అలాంటి రేర్ ఇన్సిడెంట్ కు తెరలేపాడు విజయ్ దేవరకొండ. పెళ్లి

చూపులు సినిమాతో తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను

ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోను చేశాడు. మరి విజయ్ నిర్మిస్తోన్న ఈ సినిమా

టైటిల్ గురించి అడిగితే విజయ్ దేవరకొండ ‘మీకు మాత్రమే చెప్తా’

అంటున్నాడు.

వీళ్లు టైటిల్ రివీల్ చేసిన విధానం చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. కథ కూడా

అలాగే ఉంటుందని చెబుతున్నారు. తరుణ్ భాస్కర్ తో పాటు అనసూయ భరద్వాజ్ మరో

ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటిస్తుండటం విశేషం. మొత్తంగా దర్శకులు

హీరోలు, హీరోలు దర్శకులు అవుతోన్న తరుణంలో తరుణ్ భాస్కర్ హీరోగా

నటిస్తుండటం విజయ్ దేవరకొండ తన కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్

పై నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల

చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. "మీకు మాత్రమే చెప్తా"లో తరుణ్ భాస్కర్

అబినవ్ గోమటం,అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తుంటే..పావని

గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ

ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

టెక్నికల్ టీం:

బ్యానర్: కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్

సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా,

సంగీతం : శివకుమార్,

ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్,

కో డైరెక్టర్ : అర్జున్ కృష్ణ,

పిఆర్.వో : జి.ఎస్.కె మీడియా,

లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి, నిర్మాతలు : విజయ్ దేవరకొండ,వర్ధన్ దేవరకొండ.

రచన, దర్శకత్వం : షమ్మీర్ సుల్తాన్.